Viswambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కుదర్లేదు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇంకా ఉన్నాయని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విశ్వంభర సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.
అదేమిటంటే విశ్వంభర సినిమా సెప్టెంబర్ 18న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమాల్లో కేవలం ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాటలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. అన్నయ్య సినిమాలోని పాపులర్ పాట ఆట కావాలా పాట కావాలా కి రీమిక్స్‌గా ఈ పాట ఉంటుందని సమాచారం. ఈ పాటను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
