చిరంజీవి తన లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకుని సెట్లోకి వచ్చారట

Chiranjeevi uses his real gun for shooting
Chiranjeevi uses his real gun for shooting
మెగాస్టార్ చిరంజీవి ఎదుగుతున్న సమయంలోనే పలు ప్రయోగాలు చేశారు. ఒకవైపు యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటూనే భిన్నమైన సినిమాలు కూడ చేశారు. అలా ఆయన చేసిన చిత్రమే ‘చంటబ్బాయ్’. జంధ్యాల ఈ సినిమాకు దర్శకుడు. జంధ్యాల సినిమాలంటే హీరోలు, హీరోయిజమ్ ఉండదు.  నటులు, పాత్రలు, నటన మాత్రమే ఉంటాయి. ‘చంటబ్బాయ్’ సినిమాలో కూడ అంతే.  మనకు యాక్షన్ హీరో చిరంజీవి కనబడరు.  పరిపూర్ణమైన నటుడు చిరంజీవి కనిపిస్తాడు. ఆ సినిమాలో చిరంజీవి కామెడ్డీ టైమింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పటికే చిరు టాప్ టెన్ సినిమాల్లో ‘చంటబ్బాయ్’కు చోటు ఉంటుంది.  
 
ఈ సినిమా కోసం చిరు మీసం తీసేసి ఆంగ్లో ఇండియన్ లేడీ గెటప్ వేశారు. ఛార్లీ చాంప్లిన్ గెటప్లో మెప్పించారు. హరిదాసు వేషం కట్టారు.  ఇవేనా ఇంకా ఇందులో చాలా విశేషాలే ఉన్నాయి.  డిటెక్టివ్ పాత్రలో చిరు చేతిలో ఎప్పుడూ ఒక రివాల్వర్ ఉంటుంది.  అందరూ సినిమా అంటే డూప్ గన్స్ వాడితే ఈ సినిమాలో మాత్రం చిరు నిజమైన రివాల్వర్ వాడటం జరిగింది. అప్పట్లోనే చిరంజీవి వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉండేది. ఆ తుపాకినే షూటింగ్లోకి తీసుకొచ్చి సినిమా మొత్తం వాడారట. అయితే అందుకో బుల్లెట్స్ లేవులెండి.  అయినా నిజమైన తుపాకిని వాడటం అంటే విశేషమే కదా మరి.