ప్రాణం పోయినా ఆ రోజు ని మర్చిపోను అంటున్న చిరంజీవి

తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది. చిన్న, చిన్న వేషాలు వేస్తూ…మెగాస్టార్ రేంజ్ కి ఎదిగిన చిరంజీవి చాలా మందికి ఆదర్శం. అప్పటికే తెలుగు లో ఎన్టీఆర్, కృష్ణ లాంటి సూపర్ స్టార్ లు ఉన్నప్పటికీ, అంత పోటీని తట్టుకుని స్టార్ హీరో గా ఎదిగాడు. అలాగే తన అండతో మెగా ఫామిలీ నుండి దాదాపు పది మంది హీరోలు వచ్చారు.

ఎంతమంది స్టార్ హీరో లు వచ్చినా…చిరంజీవి లాగా అంత కాలం నెంబర్ వన్ హీరో గా ఎవ్వరు నిలబడలేకపోయారు. బహుశా చిరంజీవి లా అన్ని సంవత్సరాలు టాలీవుడ్ ని ఇంకెవ్వరు రూల్ చెయ్యలేరేమో.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న చిరంజీవి కి ఒక రోజు చాలా ప్రత్యేకం. ఆయన ఆ రోజు ని ఎప్పటికి మరచిపోను అని చాలా సందర్భాల్లో చెప్పారు. చిరంజీవికి తన పుట్టినరోజు కన్నా సెప్టెంబర్ 22 అంటే చాలా ప్రతేయకం. ఎందుకంటే ఆయన కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుండి చిరంజీవి గా మారిన రోజు ఇదే.

అప్పటివరకు శివశంకర వరప్రసాద్ గా ఉన్న తాను ఆ తర్వాత సెప్టెంబర్ 22న చిరంజీవి గా జనాల ముందుకు వచ్చాడు. చిరంజీవి నటించిన మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ సెప్టెంబర్ 22 నే రిలీజ్ అయింది. నిజానికి చిరంజీవి నటించిన మొదటి సినిమా అంటే “పునాది రాళ్లు”. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా కానీ.. ‘ప్రాణం ఖరీదు’ సినిమానే ముందుగా రిలీజ్ అయింది.

ఈ కారణం వల్లే చిరంజీవికి పుట్టినరోజు తేదీ కన్నా కానీ సెప్టెంబర్ 22 అంటేనే చాలా ఇష్టమట. 1978 సెప్టెంబర్ 22వ తేదీన ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ” ఇప్పటికీ ఆ రోజున మర్చిపోలేను” అంటూ చిరంజీవి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ” నా ప్రాణం పోయినా కానీ ఆ రోజున నేను మర్చిపోలేను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అదే” అంటూ ఎమోషనల్ కూడా అయ్యారు.