లాక్ డౌన్ సడలింపులు రావడంతో సినిమా షూటింగ్స్ ఒక్కక్కటిగా మొదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిన్న, మీడియమ్ రేంజ్ సినిమాలు షూటింగ్ రీస్టార్ట్ చేయగా ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు సెట్స్ మీదకు వస్తున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ కూడ ఉంది. చిత్రీకరణ చివరి దశలో ఉండగా ఆగిపోయింది. ఈ కొద్ది భాగాన్ని పూర్తిచేయడానికి మహా అయితే 10 నుండి 15 రోజులు పడుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి దిగాలని చూస్తున్నారు టీమ్. ఈరోజే చిత్రీకరణను రీస్టార్ట్ చేశారు.
ఈరోజు నుండే చిరంజవి శూట్లో జాయిన్ అవుతారు. ఆయనతో పాటే రామ్ చరణ్ కూడ చిత్రీకరణలో పాలుపంచుకోనున్నారు. వారం రోజుల పాటు ఇద్దరూ కలిసే వర్క్ చేస్తారట. ఒక భారీ యాక్షన్ సన్నివేశంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు కొరటాల శివ. ఇవి పూర్తైతే సినిమా మొత్తం ముగిసినట్టే. ఈ షూటింగ్లో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు కూడ జాయిన్ అవుతారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే దసరాను టార్గెట్ చేశారు టీమ్. కానీ ఆలోపు అన్ని పనులు పూర్తవుతాయా, సినిమా హాళ్లు100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయా అనే సందేహాలు ఉన్నాయి. అందుకే మెగాస్టార్ టీమ్ రీలీజ్ డేట్ మీద ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.