బిగ్ అమౌంట్ ఇస్తారట… మరి ఆమె చిరంజీవికి ఓకే అంటుందా ?

Chiranjeevi producers offering big amount to bollywood actress

Chiranjeevi producers offering big amount to bollywood actress

మన సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం చాలా కష్టమవుతోంది. ఇప్పుడున్న వారిలో ఇద్దరు ముగ్గురు తప్ప వారి పక్కన వేరే ఎవ్వరూ సెట్ కావట్లేదు. వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తోంది.  దీంతో చూసే ప్రేక్షకులకు కూడ బోర్ కొట్టేస్తోంది. అందుకే ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో ఉన్నారు అందరూ. బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకీ ఇలా అందరిదీ ఇదే సమస్య.  కమర్షియల్ సినిమాలు చేసేటప్పుడు ఈ ఇబ్బందీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే చిరు హీరోయిన్ల కొరతతో కాజల్ అగర్వాల్ ను రిపీట్ చేశారు.  ‘ఖైదీ నెం 150’ తర్వాత ‘ఆచార్య’లో ఆమెతో వర్క్ చేస్తున్నారు.  ఈ సినిమాకు అంటే ఏదోలా అడ్జెస్ట్ చేశారు కానీ నెక్స్ట్ ఆయన మూడు సినిమాలు చేయాల్సి ఉంది. 

బాబీ దర్శకత్వంలో చిరు ఒక చిత్రానికి కమిటయ్యారు.  దీని ముందు ఆయన రెండు సినిమా చేయాల్సి ఉంది. వీటి రెంటికీ దక్షిణాది నుండి ఇద్దరు స్టార్ హీరోయిన్లను అనుకుంటున్నారు. వీరిద్దరితో వర్క్ చేస్తే చిరు దాదాపు అందరు టాప్ హీరోయిన్లను చుట్టేసినట్టే. కనుక బాబీ సినిమాలో చిరు సరసన కొత్త జోడీ ఉండాల్సిందే. అందుకే బాలీవుడ్లో వెతకడం స్టార్ట్ చేశారు. బాబీ సోనాక్షి సిన్హాను అప్రోచ్ అయ్యారట. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ ఆఫర్ చేయాడం జరిగిందట. అయితే సోనాక్షి గతంలో పలు దక్షిణాది ఆఫర్లను తిరస్కరించింది. కేవలం రజినీకాంత్ సినిమాలో మాత్రమే నటించిన ఆమె తెలుగు యంగ్ స్టార్ హీరోల సినిమాలకు సైతం నో చెప్పింది.  అలాంటి ఆమె చిరంజీవి సినిమాకు ఓకే అంటుందో లేదో మరి.