చిరంజీవి విజయశాంతి మధ్య మాటలు లేకపోవడానికి కారణమేంటో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చిరంజీవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కూడా ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే చాలా సంవత్సరాల నుంచి చిరంజీవి విజయశాంతి మధ్య మాటలు లేవనే సంగతి తెలిసిందే.

సరిలేరు నీకెవ్వరు సినిమా ఈవెంట్ సమయంలో చిరంజీవి, విజయశాంతి కలిసి కనిపించినా ఆ సమయంలో మాత్రమే వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవితో మాటలు లేకపోవడం విజయశాంతి స్పందించడంతో పాటు వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సినీ ప్రముఖుల నుంచి తనకు మద్దతు లభించలేదని అందువల్ల తాను రెండు దశాబ్దాల పాటు మాట్లాడలేదని విజయశాంతి అన్నారు.

2009 ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణలో మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలయ్యాయి. చిరంజీవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విజయశాంతి కోరిన విధంగా మద్దతు ప్రకటించి ఉంటే మాత్రం వీళ్లిద్దరి మధ్య మాటలు ఉండేవని తెలుస్తోంది.

చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో ఏకంగా 19 సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. చిరంజీవి, విజయశాంతి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు చిరంజీవికి క్రేజ్ పెరుగుతోంది.