హీరోయిన్‌కు లిప్‌లాక్ ఇచ్చిన చిరంజీవి.. ఆ త‌ర్వాత చాలా బాధ‌ప‌డ్డ మెగాస్టార్

తెలుగు సినిమా పరిశ్ర‌మ గ‌ర్వించ ద‌గ్గ న‌టుల‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు అంత‌లా క్రేజ్ తెచ్చింది ఎవ‌రంటే మెగాస్టార్ అని బ‌ల్ల‌గుద్ది చెప్ప‌వ‌చ్చు. బ్రేక్ డ్యాన్స్‌తో ఆడియ‌న్స్ మ‌న‌సుల‌ను దోచుకున్న చిరంజీవి న‌ట‌న‌తోను అల‌రించారు. కెరీర్‌లో 150కి పైగా సినిమాలు చేసిన చిరు ప్ర‌తి చిత్రంలో వైవిధ్యాన్ని చూపించి అశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ త‌న స‌త్తా చాటుతున్న ఆయన ఏ రోజు హ‌ద్దులు మీరి ప్రేక్ష‌కుల‌కు విర‌క్తి తెప్పించ‌లేదు.

ఇప్ప‌టి సినిమాలలో లిప్ కిస్‌లు, రొమాన్స్‌లు కామ‌న్‌గా మారాయి. ఆ రోజుల‌లో ఇలాంటివి ఏమి లేకుండానే సినిమాలు భారీ విజ‌యాలు సాధించేవి. అయితే త‌న‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన ఘ‌రానా మొగుడు చిత్రంలో చిరంజీవి.. ముంబై బ్యూటీ న‌గ్మాకు ఇచ్చాడ‌ట‌. పండు పండు అనే పాట‌లో భాగంగా న‌గ్మాకు లిప్ కిస్ ఇచ్చిన చిరు ఆ ప‌ని చేసినందుకు చాలా ఫీల‌య్యార‌ట‌. త‌ప్పు చేశాన‌ని మ‌ద‌న‌ప‌డ్డార‌ట‌.ఒక రాత్రంతా స‌రిగా నిద్ర‌పోలేద‌ట కూడా. అయితే సినిమా షూటింగ్ పూర్తై ఎడిటింగ్ స్టార్ట్ అయిన‌ప్పుడు చిరంజీవి స్వ‌యంగా ఎడిటింగ్ రూమ్‌కు వెళ్లి లిప్‌లాక్ సీన్‌ను క‌ట్ చేయించేశాడ‌ట‌.

తెలుగు సినిమా రికార్డ్స్‌ను బ‌ద్ద‌లు కొట్టిన ఈ చిత్రం సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన మ‌న్న‌న్‌కు రీమేక్‌గా తెర‌కెక్కింది. ఇందులో బంగారు కోడి పెట్ట అనే సాంగ్ ఎంత సెన్సేష‌న్ సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హైద‌రాబాద్‌, వైజాగ్‌, బెంగుళూరు, ఊటీ, మ‌ద్రాసుల్లో డెబ్బై రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. ఈ సినిమాకు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తే 4 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు వ‌చ్చాయి. ఇండ‌స్ట్రీ రికార్డులు బ‌ద్దులు కొట్టిన ఈ సినిమా వంద రోజుల వేడుక‌ని గుంటూరులో ఘ‌నంగా నిర్వహించారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత లూసిఫ‌ర్ రీమేక్, వేదాళం రీమేక్ చేయ‌నున్నాడు.