తెలంగాణ రాష్ర్టంలోని సూర్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం పాలకొల్లు మండలం అగర్తిపాలెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులతో పాటు, వారు కుమారుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మైలాబత్తుల సత్యానందం, విజయకుమారి దంతపులుగా కాగా, వాళ్ల కుమారుడు జోసఫ్ మృతిచెందడంతో పాలకొల్లులో విషాధ చాయలు అలుముకున్నాయి. ఒకే ఘటనలో ముగ్గురు చనిపోవడంతో మిగతా కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర మనస్థాపానికి గరయ్యారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
మైలా బత్తుల సత్యానందం మెగాస్టార్ చిరంజీవి బాల్య స్నేహితులుట. ఇరువురు ఎంతో స్నేహంగా మెలిగేవారుట. ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్ అట. నరసాపురం వైఎస్ కళాశాలలో చిరు-సత్యానందం కలిసి చదువుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందిట. అటుపై చిరంజీవి సినిమాల్లోకి రావడం, సత్యానందం రాజమండ్రి డిగ్రీ కళాళాలలో అధ్యాపకుడిగా వెళ్లిపోయారుట. అలా చిరంజీవి-సత్యానందం మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
ఆ తర్వతి కాలంలో ఇద్దరి మధ్యా స్నేహం కొనసాగిందా? లేదా? అన్నది తెలియదు గానీ! ఈ విషయం ఇంకా చిరంజీవి దృష్టికి వెళ్లినట్లు లేదు. లేదంటే ఆయన స్నేహితుడి మరణంపై స్పందించి ఉండేవారు. కాగా సత్యానందం మరణంపై ఇప్పటికే స్థానిక నేతలు వివాళులు అర్పించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైకాపా పార్టీ నియోజక వర్గ ఇన్ చార్జ్, డీసీసీబీ చైర్మన్ , డీసీఎంసీ చైర్మన్ తదితులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.