‘మా’ ఎన్నికల గోడవంతా చిరంజీవి నెత్తినే రుద్దుతున్నారుగా

Chiranjeevi Maa elections
Chiranjeevi Maa elections
మా అధ్యక్ష ఎన్నికలు ఆరంభంలోనే ఆసక్తికరంగా మారాయి.  ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ లాంటి వారు ఇప్పటికే బరిలో దిగారు. ప్రకాష్ రాజ్ అయితే ప్రెస్ మీట్ పెట్టేసి చాలా సంగతులే మాట్లాడారు.  ఎందుకు ఎన్నికల్లో నిలబడుతున్నది, నాన్ లోకల్ ప్రస్తావన మీద మండిపాటు, చిరంజీవి ప్రస్తావన, మీడియాకు చీవాట్లు ఇలా అనేక సంగతులు మాట్లాడి సంచలనం అవుతున్నారు ఆయన.  ఒక వర్గం మీడియా మాత్రం పోటీలోకి దుగుతున్న అధ్యక్ష అభ్యర్థుల్లో, వారి వారి ప్యానెల్ సభ్యుల వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు గట్టిగా చెబుతున్నారు. 
 
మంచు విష్ణు అభ్యర్థిత్వం వెనుక కొండంత అండగా చిరంజీవి ఉన్నారని, ఆయన సలహా తీసుకునే విష్ణు ఎన్నికల బరిలోకి దిగుతున్నాడని ఇప్పటికే ఒక అంశం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.  ఇక పలువురు సభ్యుల ప్యానెల్ నందు గల సభ్యులను ఎంపిక చేసింది చిరంజీవేనని, ఎలాంటి ఆసక్తి లేని వ్యక్తులను స్వయంగా బరిలోకి ఆయనే దింపారని, చిరు మాటను కాదనలేక పలువురు పోటీలోకి దిగడం జరిగిందని, వారి గెలుపుకు కూడ ఆయనే హామీ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి మా ఎన్నికల వ్యవహారం మొత్తం తెరవెనుక కూర్చున్న చిరంజీవి కనుసన్నల్లో నడుస్తుందనే భావన కలిగేలా ప్రచారం జరుగుతోంది.  మరి ఇందులో ఎంత నిజం ఉందో ఏమో.