ఎవరి జీవితం గురించి ఎవరు మాట్లాడుతున్నారు.? సమంత – నాగచైతన్యఅక్కినేని (చై-సామ్ )విడాకులు తీసుకుంటే, అలా విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇవేనని ఎవరైనా చెప్పగలరా. ? అవకాశమే లేదు. చైతూ తండ్రి నాగార్జున సైతం, ఈ పరిస్థితిపై ఏం మాట్లాడాలో తెలియక సైలెంటయిపోయారు.. వారిద్దరూ విడిపోవడం తనను బాధిస్తోందని అన్నారు.
సినీ నటి మాధవీలత మాత్రం, నాగచైతన్య – సమంత విడిపోవడానికి చాలా కారణాలున్నాయంటూ తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేసింది. మీడియాలో రకరకాల చర్చలు చైతూ – సామ్ విడిపోవడానికి సంబంధించి జరుగుతున్నాయి.
సినిమాల్లో నటించడాన్ని సామ్ కొనసాగించాలనుకుంటే, అక్కినేని కుటుంబం వద్దేసిందనీ, పిల్లల్ని కనే విషయమై సామ్ – చైతూ మధ్య విభేదాలొచ్చాయనీ, ఆస్తుల పంపకాల్లో రచ్చ జరిగిందనీ.. ఇలా సవాలక్ష ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటినే తిప్పి తిప్పి మార్చి మార్చి చెప్పింది మాధవీలత.
అసలు మాధవీ లతకి ఈ విషయంతో ఏం సంబంధం.? అయితే, ఈ విషయమై సామ్ వివరణ ఇవ్వాలి. లేదంటే, చైతూ స్పష్టతనివ్వాలి. ‘మేమిద్దరం విడిపోతున్నాం..’ అని ఇరువురూ ప్రకటించాక.. అలా ఎందుకు వాళ్ళు విడిపోయారన్నది వారి వ్యక్తిగత విషయం. అనవసరంగా ఇతరులు అందులో తలదూర్చడమెందుకో.!