తమ పెళ్ళి రోజు కోసం ఇటలీకి బయలుదేరిన చరణ్, ఉపాసన.. వైరల్ గా మారిన ఫోటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రామ్ చరణ్ ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇక ఈయన తాజాగా తన భార్యతో ఇటలీకి బయల్దేరుతున్నట్లు తెలిసింది. పదేళ్ల క్రితం రామ్ చరణ్ ఉపాసన ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నారు. ఇదిలా ఉంటే తమ పదో పెళ్లి రోజు సందర్భంగా ఈ జంట ఇటలీకి బయలుదేరినట్లు తెలిసింది. అక్కడ తమ పెళ్లి రోజును జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు బయలుదేరుతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.