Chandrababu : భగ్న ప్రేమికుడిగా మారిన చంద్రబాబు

Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భగ్న ప్రేమికుడిలా మిగిలిపోనున్నారా.? దయ తలచి ఎవరైనా ఆయన ప్రేమని అర్ధం చేసుకుంటారా.? వన్ సైడ్ లవ్ సత్ఫలితాలను ఇవ్వదనీ చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలకు చేసిన హిత బోధ గురించి తెలుగు నాట రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది.

వామ పక్షాలతో మొదలు పెడితే, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీనీ చంద్రబాబు వదలలేదు. అన్ని పార్టీల మీదకీ ప్రేమ బాణాలు సంధిస్తూనే వున్నారు. అందరూ ఛీ కొట్టేశాకా, మళ్లీ పాత ప్రేమికుల్నిగుర్తు తెచ్చుకుంటున్నారు. ఏం చేస్తాం.? మనం ప్రేమిస్తే సరిపోదు. మనల్ని కూడా ప్రేమించాలి.. అంటూ నిర్వేదం ప్రకటించారు టీడీపీ అధినేత.

చంద్రబాబు ఇప్పటిదాకా గుర్తు పెట్టుకోని పార్టీ ఏదైనా వుంటే, అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏమో ఆ ముచ్చట కూడా చంద్రబాబు అతి త్వరలో తీర్చేసుకుంటారేమో. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనీ రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు.

కానీ, దీన్ని చంద్రబాబు భాషలోకి కొత్తగా మార్చి చెప్పుకోవాలప్పుడు. రాజకీయాల్లో శాశ్వత ప్రేమికులు ఎవరూ ఉండరని. కొంత కాలానికే ప్రేమిస్తుంటారు. అవసరం తీరాకా వదిలేస్తుంటారు. మళ్లీ అవసరం వచ్చాకా వెంటపడుతుంటారు.

జనసేన పార్టీ మీదకి తాజాగా ప్రేమ బాణాలు సంధిస్తున్న చంద్రబాబు, అట్నుంచి చిన్నపాటి సానుకూలత కనిపిస్తే చాలని పరితపిస్తున్నారు. చంద్రబాబు పరిస్థితిని చూసి, జనసేన మాత్రమే కాదు, మిగతా పార్టీలు కూడా జాలి పడుతున్నాయి. అలాగని, చంద్రబాబు వైపు సానుకూలంగా ఎవరూ చూసేలా లేరు. ప్రేమ పేరుతో చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లు అలాంటివి. ..