Chandrababu : మెగాస్టార్ చిరంజీవిపై చంద్రబాబు తాజా ఏడుపు.!

Chandrababu : ‘ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు.. రాజకీయాలకు దూరమయ్యాక కూడా చిరంజీవి ఎప్పుడూ నాతో మంచిగానే వున్నారు..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాజాగా సెలవిచ్చారు.

కానీ, అదే నోటితో, ‘చిరంజీవి వల్లనే 2009 ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయాం. చిరంజీవి గనుక అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టకుండా వుంటే, మేం అధికారంలోకి వచ్చేవాళ్ళం..’ అని చంద్రబాబు తన సహజ సిద్ధమైన ఏడుపుని మెగాస్టార్ చిరంజీవి మీద కొనసాగించారు.

రాజకీయాల్లో ఎవరి సమర్థతను బట్టి వాళ్ళకు అవకాశాలు దక్కుతాయి. చంద్రబాబు సమర్థుడే అయితే, 2009 ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కేది. అప్పటికి అధికారంలో వుంది కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నారు. చిరంజీవి పార్టీ పెట్టారు, చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించారు. కాంగ్రెస్ మీద కంటే ఎక్కువ ఫోకస్ చిరంజీవి మీద పెట్టి టీడీపీ నష్టపోయింది.

చిరంజీవి కుటుంబ సభ్యుల మీద అప్పటి టీడీపీ నేతలు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని ఎవరూ మర్చిపోలేరు. పోరాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మద.. అన్న కనీస విజ్ఞతను చంద్రబాబు విస్మరించడం ద్వారా టీడీపీని నాశనం చేశారు, ప్రజారాజ్యం పార్టీనీ చంద్రబాబు దెబ్బతీశారు.

2019 ఎన్నికల్లోనూ అంతే.. బీజేపీ మీదా, జనసేన మీద ఫోకస్ పెట్టి, అధికార వైసీపీకి పరోక్షంగా చంద్రబాబు సహకరించారని అనుకోవాలేమో. తన వైఫల్యాల్ని ఎదుటివారి మీద బలవంతంగా రుద్దేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా.

2009లో అధికారం దక్కలేదు సరే, 2014 ఎన్నికల్లో అధికారం దక్కింది కదా.? ఆయన వల్ల తెలుగు నేలకు కలిగిన అదనపు ప్రయోజమేంటి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన ఉద్ధరింపు ఏంటి.?

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles