Chaitu With Full Clarity : సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు.? అన్న ప్రశ్న చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. చాలా సస్పెన్స్ కూడా నెలకొంది. ‘ఇద్దరం పరస్పర అవగాహనతో తీసుకున్న నిర్ణయం.. ఇద్దరూ విడిపోయి, మంచి స్నేహితుల్లా వుండాలనుకుంటున్నాం..’ అంటూ వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ ఓ ప్రకటన ఇటీవల ఇరువురూ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి సమంత సోషల్ మీడియా పోస్టుల్లో పరోక్షంగా నాగచైతన్య మీద సెటైర్ల లాంటి కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే, నాగచైతన్య ఎక్కడా అలాంటి చర్యలకు దిగలేదు. సమంత పలు ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలూ భిన్న కోణాల్లో ప్రొజెక్ట్ అయ్యాయి చైతూ విషయమై. అయినాగానీ, నాగచైతన్య చాలా స్పష్టతతో వున్నాడు.
‘కెరీర్ పరంగా ఇద్దరం హ్యాపీ..’ అని ఓ చిన్న మాటతో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు నాగచైతన్య. కానీ, సమంత వైపు నుంచే ‘కవ్వింతలు’ ఎక్కువగా కనిపిస్తున్నాయన్న భావన నాగచైతన్య అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
చైతూతో పోల్చితే మొదటి నుంచీ సమంత సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్. అభిమానులతో టచ్‌లో వుండేందుకు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండక తప్పదు. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు, షేర్ చేసే ఆలోచనలు.. ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి.
సమంత ‘ఊ అంటావా మామ..’ అంటూ ‘పుష్ప’ సినిమా కోసం చేసిన ఐటమ్ సాంగ్ కూడా వివాదాస్పదమయ్యింది. ‘ఇదంతా కావాలనే సమంత చేస్తోంది..’ అంటారు కొందరు. ‘నాన్సెన్స్..’ అంటారు మరికొందరు. ఇంతకీ ఏది నిజం.? ఎవరికి ఎంత అర్థమయితే అంత.