Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య తన తండ్రితో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బంగార్రాజు చిత్రం ద్వారా సంక్రాంతి పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేటు దారుణంగా తగ్గించడంతో ఎంతో మంది నిర్మాతలు సినిమా టికెట్ల విషయంపై స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అయితే ఈ సినిమా టికెట్ల వ్యవహారం పై నాగార్జున మాత్రం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించడం వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని నాగార్జున బహిరంగంగా చెప్పడంతో విమర్శలు చోటుచేసుకున్నాయి.
తాజాగా నాగార్జున మాట్లాడిన ఈ వ్యాఖ్యలకు నాగచైతన్య మద్దతు తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య సినిమా టికెట్ల రేటు తగ్గించడం వల్ల మా సినిమాకు ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే సినిమా టికెట్ల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ లో జీవో విడుదల చేసింది. మా సినిమాను ఆగస్టులో ప్రారంభించాము. అయితే సినిమా రేట్లను దృష్టిలో పెంచుకుని ఈ సినిమా బడ్జెట్ అంచనా వేసుకున్నామని దీంతో ఈ సినిమాకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు.ఒకవేళ సినిమా రేట్లు పెంచితే మా సినిమాకు బోనస్ అవుతుందని ఈ సందర్భంగా నాగచైతన్య ఏపీ టికెట్ల వ్యవహారం పై తనదైన శైలిలో స్పందించారు.