మీటర్లు పెడితే వారి అక్రమాలు బయటపడతాయంటున్న బండి సంజయ్..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొని విద్యుత్ బిల్లులు గురించి మాట్లాడాడు. తెరాస నేతలు మీటర్ల పై కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అన్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ను కూడా అక్రమ మార్గాల్లో వాడుకుంటున్నారని మండిపడ్డాడు.

మీటర్లు పెడితే బడాబాబుల ఫాంహౌస్ లలో విద్యుత్ అక్రమాలు బయట పడతాయని అన్నాడు. బినామీ వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి కమిషన్లు తీసుకుంటున్నారని అన్నాడు. ప్రజల నడ్డి విరిచేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నాడు. ఓపెన్ మార్కెట్లో రూ.3 కు కొనే కరెంటును ప్రభుత్వం రూ.6 కు కొనుగోలు చేస్తుందని ఈ విషయం గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని గట్టిగా హెచ్చరించాడు.