Bahubali Actor : బ్రేకింగ్ : కరోనా నుంచి కోలుకున్న బాహుబలి నటుడు.. థర్డ్ వేవ్ పై క్లారిటీ అనుకోవచ్చా?

Bahubali Actor : జస్ట్ ఈ ఏడాది ఎంటర్ అవుతుండడంతోనే కరోనా మూడో వేవ్ ఊహించని షాక్ అందరికీ ఇచ్చిన తెలిసిందే. అనేక భారీ సినిమాలు ఎప్పుడు నుంచో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నవి వాయిదా పడిపోవడం ఒకెత్తు అయితే ఈ గ్యాప్ లోనే మన సౌత్ ఇండియన్ సినిమాకి చెందిన ప్రముఖ నటులు హీరోలు, హీరోయిన్ లు కరోనా బారిన పడుతున్నారనే వార్తలు మరింత ఆందోళనను నెలకొల్పాయి. అయితే ఈసారి మూడో వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది అని ఒక అపోహ కూడా లేకపోలేదు.

మరి ఈ బ్యాడ్ సిచువేషన్స్ లో ఒక గుడ్ న్యూస్ వినిపించింది. గత కొన్ని రోజులు కితం బాహుబలి నటుడు కట్టప్ప సత్య రాజ్ కరోనా బారిన పడిన వార్త అందరికీ తెలిసిందే. మరి తర్వాత కట్టప్ప ఆరోగ్యం కాస్త విషమం కూడా అయ్యిన వార్తా బయటకి వచ్చింది. కానీ ఇపుడు బ్రేకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

సత్య రాజ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడట. తమిళనాడులో చికిత్స పొందుతున్న కట్టప్ప కోలుకోడమే కాకుండా ఈరోజే డిశ్చార్జ్ అయ్యినట్టు కూడా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అయితే ఈ వార్తతో కరోనా మూడో వేవ్ నిపుణులు చెబుతున్నట్టు అంత ప్రమాదకరం కాదని చెప్పాలి. కాకపోతే ఇదంతా వాక్సిన్ వేసుకోవడం వల్ల వేసుకోకపోవడం వలన అనే దానిపైనే ఆధార పడి ఉంది.