Brahmanandam: ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన మూవీ కన్నప్ప. ఇందులో చాలామంది స్టార్ సెలబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ లాల్,అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తుండడంతో ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీకి మరొక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేజర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించగా ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో భాగంగా బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. యాంకర్ సుమ బ్రహ్మానందంలో ప్రశ్నిస్తూ.. ఒకవేళ మోహన్ బాబు గారి సినిమాల్లో మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఏ సినిమాను ఎంచుకుంటారు?అంటూ మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఒకటి అల్లుడు గారు, రెండోది పెదరాయుడు, మూడో ఆప్షన్ గా అసెంబ్లీ రౌడీగా చెప్పింది. దీనికి బ్రహ్మానందం స్పందిస్తూ.. అసెంబ్లీ రౌడీ సినిమాను ఎంచుకుంటాను..
ఎందుకంటే మొదట ఆ సినిమాలో నన్నే అడిగారు. నేను రిజెక్ట్ చేశాను. తర్వాత మోహన్ బాబు మా ఇంటికి వచ్చి ప్రాధేయపడితే ఏం చేస్తాం సర్లే చేసుకోపో అని చెప్పాను అంటూ నవ్వుతూ చెప్పడంతో అక్కడున్న వారందరూ బాగా నవ్వుకున్నారు. ఇప్పుడు వెంటనే సుమ యమదొంగలో కూడా మిమ్మల్నే అడిగారంటా కాదా అని అడగగా.. అందులో మాత్రం నన్ను అడగలేదు.. అలాంటి పాత్రలకు ఆయనైతేనే కరెక్ట్‌గా సరిపోతాడు.. బయట సరిపోతాడు.. అలాగే స్క్రీన్ మీద కూడా ఆయనే సెట్ అవుతాడంటూ అందరినీ నవ్వించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా బ్రహ్మనందం చేసిన వ్యాఖ్యలకు అక్కడే ఉన్న మోహన్ బాబు కూడా బాగా నవ్వుకున్నారు.