బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ మూవీ రివ్యూ

నటీనటులు: విశ్వంత్, మాళవిక సతీశన్, పూజా రామచంద్రన్, హర్షవర్ధన్, తదితరులు…

దర్శకత్వం : సంతోష్ కంభంపాటి

నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, వేణు మాధవ్ పెద్ది

సంగీతం: గోపీ సుందర్

గత వారం ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాక ఈ వారం కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వంత్, మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్ లు నటించిన యూత్ ఫుల్ మూవీ  “బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్” కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆకట్టుకుందో లేదో చూద్దాం.

కథ :

ఈ సినిమా స్టోరీ తెలుగు లో బహుశా మొదటి సారి కావొచ్చు. ఇక స్టోరీ లోకి వస్తే.. మన హీరో అర్జున్ (విశ్వంత్) తనని తాను ఒక బాయ్ ఫ్రెండ్ లా అద్దెకు వెళ్తూ ఉంటాడు. కొన్ని రోజుల్లోనే తనకు బాగా డిమాండ్ పెరుగుతుంది.  చాలా మంది అమ్మాయిలు కూడా బే ఫ్రెండ్ లా తనని బుక్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే ఒక సారి నటాషా (పూజా రామచంద్రన్) అనే అమ్మాయి కూడా అతన్ని బుక్ చేసుకుని ఒక రోజు నైట్ బాయ్ ఫ్రెండ్ లా తీసుకుంటుంది. అయితే ఆ రోజు రాత్రి ఆమె అతనితో ఫిసికల్ గా  కలిసే ప్రయత్నం చేస్తే  అర్జున్ ఒప్పుకోదు. అర్జున్ నటాషా కి ఎందుకు నో చెప్తాడు? అసలు తాను ఇలా బాయ్ ఫ్రెండ్ లా వెళ్తుండడానికి కారణం ఏంటి? అర్జున్ది కి దివ్య  (మాళవిక) కి ఉన్న సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మూవీ లో మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై చూడ్డానికి  బాగుంది. అలాగే వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. విశ్వంత్ తన ఏజ్ కి తగ్గ రోల్స్ ని ఎంచుకుంటూ చేసిన ఈ రోల్ లో కూడా తాను డీసెంట్ లుక్స్ మరియు నటనతో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీ లో హీరో రోల్ కొంచెం డిసప్పోఇంట్ చేస్తుంది. తన రోల్ అనేది ఓ క్లారిటీ లేని పాత్రగా కనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. కొత్త పాయింట్ ని డైరెక్టర్ సరిగ్గా చెప్పలేకపోయాడు.

తీర్పు:

మొత్తం గా ఈ మూవీ రోమ్ కామ్ డ్రామా లో ఆర్టిస్ట్స్ నటన బాగున్నా సెకండాఫ్ లో నరేషన్ అంతగా ఆకట్టుకోదు. అయితే స్ట్రిక్ట్ గా ఒక్కసారికి మాత్రం  చూడొచ్చు.