బోయపాటి మాట ఈసారి బన్నీ వింటాడా ?

Boyapati Wants To Do Movie With Allu Arjun
 
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను కూడ ఒకరు.  ఒకప్పుడు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలంతా ఆసక్తి చూపించేవారు.  బోయపాటి కూడ తనతో పనిచేసిన హీరోకు తప్పకుండా హిట్ ఇచ్చేవారు.  అలా బోయపాటి నుండి హిట్ అందుకున్న హీరోల్లో అల్లు అర్జున్ కూడ ఒకరు.  వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ భారీ విజయాన్ని అందుకుంది.  ఇప్పడు మళ్లీ బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్.  బాలయ్యతో చేస్తున్న ‘అఖండ’ పూర్తవగానే అల్లు అర్జున్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నారు ఈయన.  కానీ అల్లు అర్జున్ ఆయనకు డేట్స్ ఇస్తాడా అనేదే పెద్ద క్వశ్చన్.  
 
ఎందుకంటే బన్నీ ఐడియాలజీ ఇప్పుడు వేరే లెవల్లో ఉంది.  చేస్తే పాన్ ఇండియా సినిమాలే చేయాలనే ఊపులో ఉన్నారు.  సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప’ పాన్ ఇండియా ప్రాజెక్ట్.  దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వర్క్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్.  కథా చర్చలు కూడ జరిగాయి.  అయితే అది వర్కవుట్ అయ్యే వాతావరణం కనిపించట్లేదు.  అందుకే వేరొక దర్శకుడ్ని వెతుకుంటున్నారు ఆయన.  బోయపాటితో సినిమా చేస్తే టాలీవుడ్లో తిరుగులేకుండా వర్కవుట్ అవుతుంది.  కానీ పాన్ ఇండియా సినిమా అంటేనే ఆలోచించాల్సిన విషయం.  అందుకే బన్నీ కూడ తటపటాయిస్తున్నాడట. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles