బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ ఫస్ట్ డే “సర్కారు వారి పాట” కలెక్షన్ డీటైల్స్ ఇవే.!

sarkaru vaari paata 1st day  : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ సినిమా “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాలు మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాగా టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయి వసూళ్ళని ఈ చిత్రం అందుకుంది అని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు.
మరి లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ 8.5 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమాపై ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి. అయితే ఈ వసూళ్లతో ఈ సినిమా ఆల్ టైం రికార్డులు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.
మరి వీటిలో ప్రాంతాల వారీగా కలెక్షన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణాలో ఆల్రెడీ 12.24 కోట్లు షేర్ అందుకోగా ఏపీలో చూస్తే ఉత్తరాంధ్ర 3.73 కోట్లు అలాగే సీడెడ్ లో 4.7 కోట్లు ఇక మిగతా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 16 కోట్లు షేర్ ని రాబట్టింది. దీనితో ఒక్క ఏపీ తెలంగాణాలో మాత్రమే 36.6 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకోగా..
ప్రపంచ వ్యాప్తంగా అయితే 60 కోట్లకి పైగా షేర్ ని ఫస్ట్ డే లోనే ఈ సినిమా రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే ఒక సాలిడ్ స్టార్ట్ ని సర్కారు వారి పాట అందుకుంది. ఇక ఈ వారాంతంలో ఎలాంటి వసూళ్లను ఈ చిత్రం అందుకుంటుందో అని ట్రేడ్ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.