బాక్సాఫీస్ రికవరీ : ఆల్ టైం రికార్డుతో స్టార్టైన “సర్కారు వారి పాట” వసూళ్లు.!

Sarkaru Vaari Paata : టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” నిన్న విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుంచి కాస్త డేవిడ్ టాక్ నే తెచ్చుకున్నా మన స్టార్ హీరోల సినిమాలు ఓపెనింగ్ రోజు ఏ రకంగా అయితే అదరగొడతాయో..

అదే రకంగా ఈ చిత్రం కూడా భారీ ఓపెనింగ్స్ ని అన్ని ఏరియాల్లో కొల్లగొట్టినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే మరి ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ మే 12 నుంచి బాక్సాఫీస్ రికవరీ మొదలు అవుతుందని చెప్పిన విధంగా మహేష్ సత్తా చాతుతున్నాడు.

ఓవర్సీస్ మార్కెట్ లో చూసినట్టు అయితే అక్కడ ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్లు కలిపి 1.1 మిలియన్ డాలర్స్(మన కరెన్సీ ప్రకారం 8 కోట్ల 50 లక్షల) గ్రాస్ భారీ మార్క్ ని అందుకోగా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో నిజాం ఏరియా వసూళ్లు బయటకి వచ్చాయి.

అక్కడ అయితే మాత్రం ఈ సినిమా ఏకంగా ఆల్ టైం నాన్ ట్రిపుల్ ఆర్(RRR) రికార్డు నెలకొల్పినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమా అక్కడ మొదటి రోజు 12.2 కోట్ల షేర్ ని రాబట్టి ఆల్ టైం రీజనల్ సినిమా రికార్డు నెలకొల్పిందట. మొత్తానికి అయితే ఒక గుడ్ స్టార్ట్ తోనే సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక మిగతా రోజులు ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేదే ముఖ్యం.