Son Of India Collection : బాక్సాఫీస్ రిపోర్ట్ : మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా” ఆ సినిమాని మించి డిజాస్టర్ అట.!

Son Of India Collection : రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో ఓ సినిమా కోసం అంత ఆసక్తికాగా మాట్లాడుకున్నది ఏదన్నా ఉంది అంటే అది కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటించిన “సన్ ఆఫ్ ఇండియా” సినిమా అనే చెప్పాలి. చాలా కాలం తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ని డైమండ్ బాబు రత్నబాబు దర్శకత్వం వహించగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిర్మాణం వహించారు.

అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ కానీ బుకింగ్స్ పరంగా గాని సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చే నడిచింది. దీనిపై మోహన్ బాబు అసహనం వ్యక్తం చెయ్యడం పలువురిపై కామెంట్స్ చెయ్యడం వంటివి ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ఎలాగో ఈ సినిమా రిలీజ్ కి పెద్దగా జనం ఎవరు లేరని ముందు నుంచి తెలిసిందే. కానీ ఇప్పుడు మొదటి రోజు వసూళ్లకు సంబంధించి టాక్ తెలుస్తుంది.

ఈ సినిమాకి మొదటి రోజు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల షేర్ వచ్చిందట. ఇది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కలెక్షన్ అని తెలుస్తుంది. అంతే కాకుండా దీనికి ముందు నాగార్జున నటించిన “ఆఫీసర్” సినిమా టాలీవుడ్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డు ఉండగా దానిని మించి అతి తక్కువ వసూళ్లు అందుకున్న చిత్రంగా ఇది నిలిచింది అట.

అలాగే ఏకంగా 100 కి పైగా షో లు జనం లేక క్యాన్సిల్ చేసేసిన సినిమా గా కూడా సన్ ఆఫ్ ఇండియా నిలిచింది అట. దీనితో టాలీవుడ్ లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.. మొత్తానికి అయితే సన్ ఆఫ్ ఇండియా పరిస్థితి ఇలా ముగిసింది.