Box Office Report Of Khiladi : బాక్సాఫీస్ రిపోర్ట్ : ఫస్ట్ డే “ఖిలాడి” ఎంత వసూలు చేసిందంటే.!

Box Office Report Of Khiladi : ఈ రెండు నెలలలో అతి పెద్ద విడుదల కలిగిన సినిమాలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి గత నెలలో అక్కినేని వారి క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “బంగార్రాజు” కాగా మరొకటి నిన్న విడుదల అయ్యిన మాస్ మహారాజ రవితేజ చిత్రం “ఖిలాడి”. రవితేజ కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించారు.

అలాగే ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి లు నటించారు. మరి మంచి అంచనాలు తోనే వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన లెక్కలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే 6.79 కోట్ల గ్రాస్ ని రాబట్టగా 4.3 కోట్ల షేర్ ని అందుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ప్రధాన ఏరియాల్లో చూస్తే నైజాం లో ఈ చిత్రం 1.86 కోట్లు, సీడెడ్ 56 లక్షలు, ఉత్తరాంధ్ర అంతా కలిపి 45 లక్షలు రాబట్టినట్టు తెలుస్తుంది. అలాగే మిగతా ఏరియా లు కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ లు అన్నీ కలుపుకొని 1.67 కోట్ల షేర్ ని ఖిలాడి రాబట్టింది.

అయితే ఇది రవితేజ కెరీర్ లో టాప్ 5 అన్నట్టు తెలుస్తుంది. అలాగే తన లాస్ట్ హిట్ “క్రాక్” తో పోలిస్తే 2 కోట్ల మేర తక్కువే వచ్చింది. అలాగే హిందీ వసూళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి చూడాలి ఫైనల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అనేది. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.