బాక్సాఫీస్ రిపోర్ట్ : “ఎఫ్ 3” సినిమా 4 రోజుల్లో ఎంత రాబట్టింది అంటే..!

f3 movie

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి మంచి ప్రామిసింగ్ అంచనాలతో రిలీజ్ కి వచ్చిన మరో సినిమా “ఎఫ్ 3”. దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ మరియు తమన్నా, మెహ్రీన్ ల తో చేసిన సెన్సేషనల్ హిట్ “ఎఫ్ 2” కి సక్సెసర్ గా తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఆ సినిమాకి ధీటుగా అదిరే వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తుంది.

అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తాలుకా నాలుగు రోజుల వసూళ్ల వివరాలు ఇప్పుడు సినీ వర్గాల నుంచి తెలుస్తున్నాయి. మొదటి మూడు రోజులు అనుకోవచ్చు కానీ సోమవారం వసూళ్లతో కూడా ఈ సినిమాని పక్కా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేర్చేయ్యొచ్చని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

మరి ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 32 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసేసిందట. ఇక సినిమా వసూళ్ల వివరాలు చూస్తే.. నైజాం – 2.03 కోట్లు, సీడెడ్ – 71 లక్షలు, ఉత్తరాంధ్ర – 66 లక్షలు, తూర్పు గోదావరి – 34 లక్షలు, గుంటూరు – 28 లక్షలు, కృష్ణ – 28 లక్షలు, వెస్ట్ గోదావరి – 20 లక్షలు అలాగే
నెల్లూరు – 14 లక్షలు తో టోటల్ గా ఈ చిత్రం 4వ రోజు 4.6 కోట్లు షేర్ అందుకోగా..

మొత్తం నాలుగు రోజులకి గాను ఈ సినిమా 32 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిందట. ఓవరాల్ గా అయితే ఈ సినిమా ఆల్రెడీ 40 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు సోనాల్ చౌహన్ లు స్పెషల్ రోల్స్ లో మెరవగా దిల్ రాజు నిర్మాణం అందించాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.