బాక్సాఫీస్ రిపోర్ట్ : ఏపీ/ తెలంగాణాలో “ఎఫ్ 3” 2 డేస్ కలెక్షన్ ఎంత వచ్చాయంటే.!

అభిమానులు ప్రేమగా వెంకీ మామ అని పిలుచుకునే వెంకటేష్ మరియు మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా గ్లామరస్ హీరోయిన్ లు తమన్నా మరియు మెహ్రీన్ లు నటించిన లేటెస్ట్ చిత్రం “ఎఫ్ 3”. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గత హిట్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కి ఆ సినిమా కలిగించిన ఇంపాక్ట్ కి తగ్గ వసూళ్లను అందుకుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా ఇపుడు రెండో రోజు వసూళ్ల డీటెయిల్స్ ప్రాంతాల వారీగా తెలుస్తున్నాయి. అయితే రెండో రోజు ఈ సినిమాలో ఏపీ తెలంగాణాలో కలిపి 8.4 కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే ఇవి ప్రాంతాల లెక్కన చూస్తే..

నైజాం – 4.1 కోట్లు, ఉత్తరాంధ్ర – 1.05 కోట్లు, సీడెడ్ – 1.15 కోట్లు, తూర్పు గోదావరి – 52 లక్షలు, వెస్ట్ గోదావరి – 29 లక్షలు, గుంటూరు – 54 లక్షలు, నెల్లూరు – 24 లక్షలు, కృష్ణ – 51 లక్షలు ఈ సినిమా అందుకుంది. దీనితో రెండో రోజు టోటల్ గా 8.4 కోట్లు షేర్ రాబట్టగా మొత్తం రెండు రోజుల్లో ఈ చిత్రం 18.77 కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల వారు కన్ఫర్మ్ చేశారు.

అలాగే యూఎస్ లో అయితే 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని ఈ సినిమా రెండు రోజుల్లో క్రాస్ చేసి 1 మిలియన్ కి దగ్గరగా ఉంది. మొత్తానికి అయితే సమ్మర్ సోగ్గాళ్లు అంటూ వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లే అందుకుంటుంది. ఫైనల్ రన్ లో ఎంత వసూలు అవుతాయో చూడాలి మరి.