Akhanda : బాక్సాఫీస్ రిపోర్ట్ : యూఎస్ లో ఇప్పటికి ‘అఖండ’ వసూళ్ల వివరాలు.!

Akhanda : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను ల సెన్సేషనల్ హిట్ “అఖండ” విజయ ఢంకా మోగిస్తుంది. మొదటి రోజు నుంచి కూడా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా భారీ వసూళ్లు కొల్లగొడుతూ దూసుకెళ్తుంది. అయితే యూ ఎస్ మార్కెట్ లో మాత్రం అఖండ బాక్సాఫీస్ సునామీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

భారీ ప్రీమియర్స్ తర్వాత రోజుకి లక్ష డాలర్లు మించి తగ్గకుండా భారీ కలెక్షన్స్ రిపోర్ట్ గీస్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం అక్కడ 8 లక్షల డాలర్ల మార్క్ ని అందుకొని సెన్సేషన్ నమోదు చేసింది. అంటే ఇప్పటి వరకు అక్కడ ఈ చిత్రం 6.12 కోట్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలు అందిస్తుంది.

అయితే మరి లాంగ్ రన్ లో 1 మిలియన్ మార్క్ ని చాలా సింపుల్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే ద్వారకా క్రియేషన్ వారు భారీ బడ్జెట్ తో బాలక్రిష్ణ కెరీర్ లోనే అధిక బడ్జెట్ సినిమా గా దీన్ని తెరకెక్కించి అంతే ఘన విజయం అందుకున్నారు.