బాక్సాఫీస్ రిపోర్ట్ : మొదటి వారం “ఎఫ్ 3” కలెక్షన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే.!

విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ సూపర్ ఎంటర్టైనింగ్ హిట్ చిత్రం “ఎఫ్ 3”. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ తమ ముందు బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కన్నా భారీ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకోగా ఈ సినిమా మొదటి వారం వసూళ్ల వివరాలు డిటైల్డ్ గా తెలుస్తున్నాయి. అయితే ఇక ఇవి ప్రాంతాల వారీగా చూస్తే.
నైజాం – 17 కోట్లు,సీడెడ్ – 6.7 కోట్లు, ఉత్తరాంధ్ర – 5.42 కోట్లు,గుంటూరు – 3.20 కోట్లు,కృష్ణ – 3.1 కోట్లు, తూర్పు గోదావరి – 3.2 కోట్లు, పశ్చిమ గోదావరి – 2.44 కోట్లు తో మొదటి వారంలో ఈ సినిమా ఏపీ మరియు తెలంగాణాలో ఈ చిత్రం 41.06 కోట్లు షేర్ ని రాబట్టగా..
ఓవర్సీస్ లో ఈ సినిమా 7.2 కోట్లు అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3.84 కోట్ల షేర్ ని రాబట్టింది. దీనితో ఈ చిత్రం మొదటి వారంలో 52 కోట్లకి పైగా షేర్ ని రాబట్టేసింది. అలాగే ఫస్ట్ వీక్ కి గాను 94 కోట్ల గ్రాస్ ని అందుకుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా మరియు మెహ్రీన్ లు నటించగా పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో కనిపించింది. అలాగే సోనాల్ చౌహన్ ఒక గ్లామరస్ రోల్ చేసింది.