పూరి జగన్నాధ్ ‘అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆసిన్ కొన్నాళ్ళల్లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ లో కూడా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయింది. ‘ఘజిని’ సినిమాతో బాగా పాపులర్ అయిన ఆసిన్ ఆయా భాషల్లో అగ్ర హీరోలందరి సినిమాల్లో నటించింది. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే సడెన్‌గా పెళ్లి చేసుకుని అన్నీ ఇండస్ట్రీస్ ని షాక్ కి గురి చేసింది ఆశిన్.
2015 వరకు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఆసిన్ 2016 వ సంవత్సరంలో మైక్రోమ్యాక్స్ కో- అధినేత అయిన రాహుల్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆసిన్ పెళ్లి సమయంలో పార్టీ కి బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది అగ్ర తారలు, సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఆ పార్టీ లో పీకల వరకు తాగిన తర్వాత రిషి కపూర్ పార్టీలో నానా రచ్చ చేయడంతో ఆ వేడుక కాస్త రద్దయ్య పరిస్థితికి వచ్చింది. అక్కడ సంగీతం బాగోలేదని, లైటింగ్ నచ్చలేదంటూ రిషి కపూర్ బాగా హంగామా చేశారు. దాంతో రాహుల్ శర్మ కలిగించుకొని గొడవ సద్దుమణిగేలా చేసినా.. అప్పటికే పార్టీ మూడ్ పాడవడంతో సెలబ్రిటీస్ అంతా వెళ్లిపోయారు. దాంతో కేవలం వేడుక మొదలైన గంటకే పూర్తయిపోయింది. అలా రిషికపూర్ తాగి గొడవ చేయడంతో ఆశిన్ పెళ్ళి విందు పెద్ద రచ్చ అయ్యింది.