ఇంటర్వ్యూల కోసం బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోవాల్సిందే?

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బిత్తిరి సత్తి అంటే తెలియని వారంటూ ఉండరు. న్యూస్ ఛానెల్స్ లో విచిత్రమైన మాటలతో, వేషధారణతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. బిత్తిరి సత్తి ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేటు స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిత్తిరి సత్తి ఇప్పుడు సెలబ్రిటీగా మారి ప్రతి నెల లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. తీన్మార్ వార్తల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన బిత్తిరి సత్తి తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఎన్నో సినిమాలలో కూడా నటించాడు.

ఇలా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొంది భారీ స్థాయిలో ఆదాయం పొందుతున్నాడు. బిత్తిరి సత్తి తన మాటలతోనే కాకుండా తన పాటలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. బిత్తిరి సత్తి పాడిన కొన్ని పాటలు అధిక వ్యూస్ సాధించాయి. అంతే కాకుండా సత్తి మిమిక్రీ కూడా ఎంతో అద్భుతంగా చేస్తాడు. ఇలా మల్టీ టాలెంట్ ఉన్న సత్తి పూల చొక్కాలు వేసుకొని, లాగులు ధరించి అందరికీ నవ్వు తెప్పిస్తాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సత్తి ప్రతీ నెలా 4 నుండి 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ యాడ్స్ కూడా చేస్తున్న సత్తి వాటి కోసం రోజుకి 6 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుటున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇవే కాకుండ పెద్ద దర్శకులు హీరోలు కూడా ప్రస్తుతం బిత్తిరి సత్తితో సినిమాలను ప్రమోట్ చేయిస్తున్నారు. ఇలా హీరో హీరోయిన్లను ఇంటర్వ్యు చేస్తూ సినిమాలని ప్రమోట్ చేస్తున్నాడు . ఈ క్రమంలో సత్తి ఒక ఇంటర్వ్యూ కి రెండు నుండి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేసే విధానం కూడా హీరో హీరోయిన్లకి నచ్చడంతో వారు కూడా అతనితో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబుని ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ మొదలైన దగ్గరినుండి చివరి వరకు మహేష్ బాబు నవ్వుతూనే ఉన్నాడు. ఇలా ఇంటర్వ్యూల ద్వారా బిత్తిరి సత్తి స్టార్ యాంకర్ సుమ కన్నా కూడా ఎక్కువ ఆదాయం అందుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.