chiranjeevi s godfather : బిగ్ అప్డేట్ : “గాడ్ ఫాథర్” పై పాన్ ఇండియా అప్డేట్ ఇచ్చిన చిరంజీవి.!

chiranjeevi s godfather : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న పలు భారీ సినిమాల్లో రెండు రీమేక్స్ ఉన్నాయి. అవే ఒకటి “గాడ్ ఫాథర్” కాగా మరొకటి “భోళా శంకర్”. అయితే ఈ రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ గా “గాడ్ ఫాథర్” ఒక సెన్సేషనల్ బిగ్ అప్డేట్ ని ఇవ్వడం ఆసక్తిగా మారిపోయింది.
గత కొన్నాళ్ల నుంచి కూడా ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడని బజ్ ఉంది. ఇప్పుడు దీన్ని నిజం చేస్తూ స్వయంగా మెగాస్టార్ నే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నట్టుగా అనౌన్స్ చేసారు.
అంతే కాకుండా సల్మాన్ రాకపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి సల్మాన్ తో వర్క్ చెయ్యడం ఆసక్తిగా ఉందని అలాగే తన రాకతో తమ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది అని తెలిపారు. అంతేకాకుండా తనతో వర్క్ చెయ్యడం కూడా ఫుల్ ‘కిక్’ ఇస్తుంది అని తెలిపి ఒక ఫోటోని పెట్టి అనౌన్స్ చేసి ఆహ్వానించారు.
మొత్తానికి అయితే ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్ళినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాని దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
https://twitter.com/KChiruTweets/status/1503941520260358147