Kamal Haasan : కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ సినిమా హక్కులకు భారీ దక్కిందట.!

Kamal Haasan : మన భారతదేశ సినిమా దగ్గర నటన కోసం అంటే మొదటగా గుర్తుకు వచ్చే దిగ్గజ హీరో పేరు లోక నాయకుడు కమల్ హాసన్. ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేసి ఇప్పటికీ చేస్తూ తన నటనతో అలరిస్తూ వస్తున్న ఈ బిగ్గెస్ట్ స్టార్ లేటెస్ట్ గా “మాస్టర్” దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో ఓ భారీ సినిమా చేస్తున్నారు.
అదే “విక్రమ్”. ఏక్షన్ మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు గ్లింప్స్ వీడియోలు భారీ స్పందనను అందుకున్నాయి. అలాగే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనడానికి మరో కారణం ఈ సినిమా తారాగణం అని కూడా చెప్పాలి.
కమల్ తో పాటుగా నటనలో మంచి పేరున్న విజయ్ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. అందుకే భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. మరి ఈ డిమాండ్ నే ఈ సినిమా బిజినెస్ ని రికార్డు లెవెల్లో జరుపుతుందట.
లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ మరియు టీవీ హక్కులు డీల్ క్లోజ్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకి గాను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు అలాగే ఓ ప్రముఖ ఛానెల్ వారు కలిపి ఏకంగా 115 కోట్లు చెల్లించి ఈ సినిమా హక్కులు కొనుక్కున్నారట.
ఇది కమల్ సహా ఇతర హీరోల కెరీర్ లోనే మరో అధికం అన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకి గాను అనిరుద్ సంగీతం అందిస్తుండగా కమల్ హాసన్ నే తన బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం అతి త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ కానుంది.