రింగ్ మాస్టర్ సన్నీ: సోలో పర్ఫామెన్స్ ఇరగదీసేశాడుగా.!

సండే ఫన్ డే అంటూ హౌస్ మేట్స్‌ని ఫుల్‌గా ఆడించి, పాడించి, నవ్వించి చివరికి ఎవరో ఒకరిని హౌస్ నుంచి బయటికి పంపించేస్తాడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ఇక తర్వాత మండే. సోమవారం వచ్చిందంటే చాలు, ఎలిమినేషన్ కోసం నామినేషన్ల పర్వం మొదలవుతుంది. అంత వరకూ ఆనందంగా ఉన్న హౌస్ మేట్స్ ఒక్కసారిగా అపరిచితులుగా మారిపోతారు. ఒకరి మీద ఒకరు ఎక్కడ లేని గ్లడ్జ్‌లను బయటికి తీసి సుత్తి సుత్తి కారణాలతో నామినేట్ చేసి పారేస్తుంటారు.

అయితే, ఈ వారరం నామినేషన్ల పర్వం కాస్త డిఫరెంట్‌గా జరిగింది. అంతా సన్ని కనుసన్నల్లో జరిగింది. దాదాపు ఈ వారం నామినేషన్లలో ఉన్నవారంతా సన్నీ డెసిషన్ మీద నామినేట్ అయినవారే. దాంతో, సోమవారానికి సన్నీ బిగ్‌బాస్ హీరో అయిపోయాడు. రింగ్ మాస్టర్‌గా మారి, టోటల్ హౌస్‌ని తన చేతుల్లోకి తీసేసుకుని దడదడలాడించేశాడు.

శ్వేత వర్మ హౌస్ నుండి బయటికి వెళ్లడానికి కారణం యాంకర్ రవి అన్న ఆరోపణతో రవిని నామినేట్ చేశాడు సన్నీ, అలాగే కాజల్ అగర్వాల్, ప్రియ, సిరి, జశ్వంత్, శ్రీరామ్ చంద్ర, యానీ మాస్టర్ ఇలా అందరి నామినేషన్లలోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సన్నీ హస్తం ఉంది. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో ఆటోమెటిగ్గా నామినేట్ అయిన సంగతి తెలిసిందే.