Home News బిగ్ బాస్4: వీడియోలతో అడ్డంగా బుక్కైన హారిక.. ఏడిపించిన నాగార్జున

బిగ్ బాస్4: వీడియోలతో అడ్డంగా బుక్కైన హారిక.. ఏడిపించిన నాగార్జున

బిగ్ బాస్ షోలో మొదటిసారిగా నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ఫుల్ యాక్టివ్ మోడ్‌లో ఉన్నాడు. మూడో సీజన్ నాల్గో సీజన్ మొత్తంలోనూ నాగార్జున నిన్నటి ఎపిసోడ్‌లో వరుసగా రాడ్లు దింపుతూనే ఉన్నాడు. ఓ కంటెస్టెంట్‌ను అంతలా హింసించడం, టార్గెట్ చేయడం, వరుసబెట్టి వీడియోలతో అడ్డంగా బుక్ చేయడం మరేతర సభ్యుల విషయంలో జరగలేదు. అలా నిన్నటి ఎపిసోడ్‌లో హారికను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. నాగార్జున వరుసగా హారికను ఆడుకుంటూనే ఉన్నాడు.

Bigg Boss 4 Telugu Week 12 Nagarjuna Targets Harika
Bigg Boss 4 Telugu week 12 Nagarjuna Targets Harika

బెస్ట్ కెప్టెన్ అంటూ హారికను ఇంటి సభ్యులు ఎన్నుకోవడంపై నాగార్జున సీరియస్ అయ్యాడు. కన్ఫెషన్ రూంలోకి పిలిచి మరీ తాటదీశాడు. నువ్ బెస్ట్ కెప్టెన్ కానే కాదంటూ ఆమె చేసిన తప్పులన్నీ విప్పి చూపించాడు. వీడియోలు ప్లే చేసి నిండా ముంచేశాడు. కన్నింగ్ గేమ్, సేఫ్ గేమ్ మొత్తాన్ని బయటకు చూపించాడు. మోనాల్‌కు చేసిన ద్రోహం, అఖిల్‌ను టార్గెట్ చేసిన విధానం, అభిజిత్‌కు మద్దతుగా తీసుకున్న నిర్ణయాల గురించి నాగార్జున క్లాస్ పీకాడు.

మోనాల్‌కు సాయం చేశానన్న నెపంతో హారిక బజర్ మోగిన తరువాత బట్టలు తీసుకువచ్చిన వీడియోను ప్లే చేశాడు.. అఖిల్‌తో స్వాప్ చేయాలని కోరినా కూడా హారిక మాత్రం అభిజిత్‌తో చేసిన వీడియోను, ఆ తరువాత హారిక మోనాల్ మాట్లాడుకున్న వీడియోను, అభిజిత్ మోనాల్ మాట్లాడుకున్న వీడియోలు, అభిజిత్ హారికలు మాట్లాడుకున్న వీడియోలను ప్లే చేసి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దెబ్బకు హారిక కంట్లోంచి నీళ్లు వచ్చాయి.

- Advertisement -

Related Posts

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

పవ‌న్‌ను ఆపలేక చేతులెత్తేసిన వైసీపీ.. మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరారు 

ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు.  కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ...

తూ.గో.జిల్లాను దడదడలాడిస్తూనే ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు సైతం సైలెంట్ 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు.  బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు.  అంతా...

ఐశ్వ‌ర్యరాయ్ నా త‌ల్లి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కుర్రాడు

సెల‌బ్రిటీల పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను నాశ‌నం చేసేందుకు కొంద‌రు కంక‌ణం క‌ట్టుకొని అదే ప‌నిలో ఉంటారు. వారి గురించి చెడు ప్ర‌చారాలు చేయ‌డం, లేదంటే క‌ట్టు క‌థ‌లు అల్లి వారి ఇమేజ్ డ్యామేజ్ చేయాల‌ని...

Latest News