బిగ్ బాస్ షోలో ఎన్ని ఓట్లు పడుతున్నాయి.. ఎవరిక ఎన్ని ఓట్లు, ఎంత శాతం పడుతున్నాయో.. ఎవరికీ తెలియదు. కానీ అప్పుడప్పుడు నాగార్జున మాత్రం ఎన్ని కోట్ల ఓట్లు పడ్డాయో చెబుతుంటాడు. మొదట్లో ఈ లెక్కలు బాగానే చెప్పేవాడు. టీఆర్పీ లెక్కలు, వారానికి ఎంత వచ్చింది.. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో టాప్ అంటూ గొప్పలు చెప్పుకుంటాడు. అలా మొదటి మూడు నాలుగు వారాల్లో ఓ సారి ఓట్ల సంఖ్య గురించి కామెంట్ చేశాడు.
ప్రారంభంలో ఓ సారి ఓట్ల గురించి మాట్లాడుతూ.. ఐదు కోట్లకు పైగా ఓట్లు పడ్డాయని చెప్పాడు. మధ్యలో మరోసారి ఆరు కోట్ల ఓట్లు వచ్చాయిన అదే హయ్యస్ట్ అని చెప్పాడు. ఇక తాజాగా నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం మరో ఫిగర్ చెప్పాడు. ఇంత వరకు రానటు వంటి సంఖ్యను చెప్పాడు. నాల్గో సీజన్‌లో ఇదే హయ్యస్ట్ అంటూ 9.5 కోట్ల ఓట్లు వచ్చాయని చెప్పడంతో ఇంటి సభ్యులందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే అందులో మెజార్టీ శాతం ఓట్లు అభిజిత్‌కు వచ్చి ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే నాగార్జున చెప్పిన ఈ ఓట్ల లెక్కలు, వచ్చే టీఆర్పీ రేటింగ్ పాయింట్లలో మాత్రం పొంతన లేకుండా పోతోంది. ప్రతీవారంలో టీఆర్పీ రెండంకెల సంఖ్యకు చేరుకోవడమే లేదు. ఎప్పుడూ కూడా పది దాటింది లేదు. కేవలం వీకెండ్ షోలో మాత్రం అలా పది దాటుతూ ఉంటుంది. కానీ ఓట్లు మాత్రం కోట్లలో పడుతున్నాయని చెబుతున్నారు. అసలు లోలోపల ఏం జరుగుతుందో బిగ్ బాస్ టీంకే తెలియాలి. ఏది ఏమైనా ఈ షో పూర్తయ్యేందుకు సమయం ఆసన్నమైంది.