“పుష్ప 2” తర్వాత ఏకంగా ఆ సినిమాకి సైన్ చేసిన విజయ్ సేతుపతి.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని అటు తెలుగు సహా మరోపక్క రానున్న రోజుల్లో హిందీ నుంచి కూడా పలు సినిమాలు సిద్ధం అవుతున్నాయి. దీనితో మన ఇండియన్ సినిమా ఫిల్మ్ మేకర్స్ కూడా తమ సినిమాలు అందరికీ చేరువ కావాలని అన్ని సినిమాల నుంచి కూడా అనేక మంది స్టార్స్ ని తీసుకుంటున్నారు.

ఇక ఇదే విధంగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో పుష్ప 2 కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ రెండో సినిమాపై తారా స్థాయి హైప్ ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో యాక్టింగ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యినట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.

తమిళ్ సహా తెలుగు మీడియా వర్గాలు కూడా ఈ వార్తలు కన్ఫర్మ్ చెయ్యగా తాజాగా ఈ స్టార్ నటుడు మరో భారీ సినిమా ఓకే చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి ఏకంగా విజయ్ సేతుపతి బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ చేస్తున్న “జవాన్” లో విలన్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ తో ఓకే అవ్వగా ఆల్రెడీ టైటిల్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాకి విజయ్ సేతుపతి సైన్ చేసినట్టుగా వార్తలు కన్ఫర్మ్ అవుతున్నాయి. మొత్తానికి అయితే మాత్రం విజయ్ సేతుపతి భారీ సినిమాలతో ఇండియన్ సినిమా దగ్గర ఒక హాట్ కేక్ లా మారాడు.