బిగ్ అప్డేట్ : “దృశ్యం 2” కూడా డిజిటల్ రిలీజ్..ఎందులో అంటే

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గత చిత్రం “నారప్ప” ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్టయ్యింది. ఇక దాని తర్వాత వెంకటేష్ నటించిన “దృశ్యం 2” కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఇది తన మరో హిట్ దృశ్యం కి సీక్వెల్ గా వచ్చింది.

చాలా తొందరగానే కంప్లీట్ చేసిన ఈ చిత్రం కూడా ఎట్టకేలకు డిజిటల్ రిలీజ్ కే ఫిక్స్ అయ్యింది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే నవంబర్ 25 వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కి తీసుకువస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఫైనల్ గా ఎన్నో నెలల నుంచి ఆసక్తిగా ఉన్న ఎదురు చూపులకి ఇప్పుడు తెర పడింది.

ఈ చిత్రంలో గత సినిమా కాస్ట్ మీనా, ఎస్తర్ అనీల్ లు నటించగా ఒరిజినల్ దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ తో వెంకటేష్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.