బిగ్ అప్డేట్ : “ఆచార్య” నుంచి మరో టీజర్ కట్ కి డేట్ ఫిక్స్.!

Big Update Came From Megastar Acharya | Telugu Rajyam

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య”. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఈరోజు చిత్ర బృందం ఓ కీలక అప్డేట్ ని ఇస్తున్నామని చాలా సేపు వారిని ఎదురు చూసేలా చేసారు.

కానీ ఎట్టకేలకు ఆ బిగ్ అప్డేట్ ని అయితే రివీల్ చేశారు. ఇంతకు ముందు మెగాస్టార్ ని ఆచార్య గా టీజర్ లో చూసారు. ఈసారి చరణ్ చేసిన సిద్ధ పాత్ర టీజర్ ని అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిని వచ్చే నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ టైం ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చెయ్యలేదు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అలాగే మణిశర్మ సంగీతం అందించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles