సమంతకి అగ్ని పరీక్ష !!

సమంత రుత్ ప్రభు ప్లాన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు! ఆమె ఈసారి చాలా పెద్ద ప్లాన్ తోనే వెళుతోంది అంటున్నారు సన్నిహితులు. తన సినిమా ‘యశోద’ ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసి విడుదల చేయిస్తోంది. తనే దగ్గరుండి దర్శకులకి, నిర్మాతకి ఈ సినిమా విడుదల విషయంలో ఎలా చేయాలనే సూచనలు, సలహాలు కూడా ఇస్తోందిట. దక్షిణాది భాషల్లో ఆమెకి బాగా ఫాలోయింగ్ ఉన్నమాట నిజమే కానీ, ఇప్పుడు హిందీలోకి ఈ సినిమాతో అడుగు పెడుతోంది. ఇది డైరెక్ట్ సినిమా కాకపోయినా, డబ్బింగ్ చేసి విడుదల చేయిస్తోంది. హేమాహేమీలు వున్న హిందీ చిత్ర సీమలో సమంత ఒక డబ్బింగ్ సినిమాతో పోటీ పడాలనుకుంటోంది. పోటీ అనేకన్నా, ఆమె తన ప్రాబల్యం హిందీ లో కూడా చూపించాలని తాపత్రయ పడుతోందిట.

‘ఫామిలీ మేన్’ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులకి దగ్గరయ్యాను అని ఆమె అనుకోవటం వల్లనే, ఈ ‘యశోద’ హిందీలో విడుదల చేయిస్తోంది అని ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే, సమంత డైరెక్ట్ గా హిందీ సినిమాలో చేసే అవకాశం కూడా వుంది అని చెప్పుకుంటున్నారు. ఈ ‘యశోద’ సినిమా ట్రైలర్ విడుదల ఒక్కో భాషలో ఒక్కో టాప్ యాక్టర్ తో చేయిస్తోంది. తమిళ ట్రైలర్ సూర్య తో, మలయాళం ట్రైలర్ దుల్కర్ సల్మాన్ తో, రక్షిత్ శెట్టి తో కన్నడ ట్రైలర్ విడుదల చేయిస్తోంది. తనకు తోచిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది సమంత. ‘పుష్ప; లో చేసిన ఒక ఐటెం సాంగ్ తో సమంత పాన్ ఇండియా స్టార్ అయిపొయింది. అందుకే ‘యశోద’ని అన్ని భాషల్లో విడుదల చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతోందట. ఇది నిజంగా అగ్ని పరీక్ష సమంతకి. ఎందుకంటే మొదటి సారిగా సినిమా మొత్తం ఆమె మీదే నడుస్తోంది, అందులో లీడ్ యాక్టర్ కూడా లేడు. అదీ సంగతీ!!