Mahesh Babu Health : బిగ్ న్యూస్ : మహేష్ బాబు ఆరోగ్యంపై లేటెస్ట్ సమాచారం.!

Mahesh Babu Health : గత కొన్ని రోజులు కితమే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకి ఒక ఊహించని షాకింగ్ వార్త ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను కరోనా పాజిటివ్ అయ్యినట్టుగా తెలపడంతో మహేష్ అభిమానులు చాలా నిరాశకి లోనయ్యి తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు. మరి ఇదే ఒక బ్యాడ్ న్యూస్ అనుకుంటే ఆ కొన్ని రోజుల్లో మహేష్ సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్ను మూయడం మరింత బాధాకరంగా మారింది.

దీనితో ఒకదాని తర్వాత మరొక ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఈ సమయంలో మహేష్ ఆరోగ్యానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. గత కొన్ని రోజులు నుంచి మహేష్ ఆరోగ్యం నిలకడగానే కొనసాగుతుండగా ఈరోజు మహేష్ మరోసారి కరోనా టెస్ట్ చేయించుకున్నాడట.

మరి ఈ టెస్ట్ లో ఫైనల్ గా తానై నెగిటివ్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఇది మంచి గుడ్ న్యూస్ గా ఈ పండుగకి దక్కినట్టు అయ్యింది. సో ఇక మహేష్ మళ్ళీ తన సినిమాల్లో బిజీ అవుతాడని చెప్పాలి. ప్రస్తుతం అయితే మహేష్ “సర్కారు వారి పాట” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.