లేటెస్ట్ : సమంత – విజయ్ లకు ప్రమాదంపై బిగ్ క్లారిటీ.!

రీసెంట్ గా మన టాలీవుడ్ లో టైటిల్ తోనే కాంట్రవర్సీ రేపిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత ఆలాగే దర్శకుడు శివ నిర్వాణ ల కాంబినేషన్ లో అనౌన్స్ అయ్యిన “ఖుషి” సినిమా అని చెప్పాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన క్లాసిక్ హిట్ ఖుషి టైటిల్ తో రావడంతో వారిపై నెగిటివ్ టాక్ గట్టిగానే వచ్చింది. కానీ ఎట్టకేలకు చిత్ర యూనిట్ ఆల్రెడీ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసేసారు. అయితే ఈ షెడ్యూల్ కి సంబంధించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ లో విజయ్ అలాగే సమంతా ఇద్దరూ గాయాల పాలయ్యారని ఓ వార్త అభిమానులను కాస్త ఆందోళనకి గురి చేసింది. అయితే ఇప్పుడు దీనిపై చిత్ర పరిశ్రమ నుంచి క్లారిటీ బయటకి వచ్చింది. సినిమాలో ఎవరూ గాయపడలేదని విజయ్ సమంత లు ఇప్పుడు బాగానే ఉన్నారు అని కన్ఫర్మ్ చేసారు.

అలాగే అక్కడ 30 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ కి వచ్చారని ఆ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ చేశారు. దీనితూ విజయ్ మరియు సమంత అభిమానులు ఈ బిగ్ క్లారిటీతో కాస్త నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నారు.