గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చిన నందమూరి హీరో..మహేష్ సినిమాలో ఉన్నట్టా లేనట్టా??

గత కొన్ని రోజులు నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో ప్లాప్ తర్వాత వస్తున్న మూడో సినిమా అయినా కూడా తారా స్థాయి అంచనాలు సెట్ అయ్యాయి. మరి ఇదిలా ఉండగా త్రివిక్రమ్ సినిమాలు అంటే ఏ రేంజ్ లోనుంటాయో ఆ తారాగణం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.

అలాగే ఈ సినిమాకి కూడా అగ్ర తారాగణం సెట్ చేస్తున్నట్లు గా వార్తలు వినిపించాయి. అయితే వీటిలో నందమూరి వారి టాలెంటెడ్ హీరో తారక్ రత్న మహేష్ ని ఢీ కొనే విలన్ గా కనిపిస్తాడని పలు రూమర్స్ వైరల్ అయ్యాయి. అలాగే నిన్ననే తారక రత్న పోస్ట్ అంటూ ఒక పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో తారక్ రత్న పాత్రపై అతడే స్పందించినట్టుగా సినీ పరిశ్రమ నుంచి నందమూరి కంపౌండ్ నుంచి అఫీషియల్ క్లారిటీ బయటకి వచ్చింది.

ఈ విషయంలో తారక్ రత్న మాట్లాడుతూ ఈ వార్తల్లో ఇప్పుడు ఎలాంటి నిజం లేదని అవన్నీ అసత్య ప్రచారాలు అని కన్ఫర్మ్ చేసాడు. అలానే తనకి ఫేస్ బుక్ లో గాని ట్విట్టర్ లో గాని ఎలాంటి ఖాతాలు లేవు అవి ఎవరో కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఎవరూ వాటిని నమ్మొద్దని తాను తెలిపారు. అయితే నిన్న పోస్ట్ తో ఈ అకౌంట్ నిజమైంద ఫేక్ అకౌంటా అనేది తెలుసుకోవాలి అని అంతా కోరుకున్నారు ఇప్పుడు వారి అందరికీ ఈ గాసిప్స్ పై ఒక క్లారిటీ వచ్చేసినట్టే..