Mahesh Babu : బిగ్ బజ్ : మహేష్ సినిమాని ఇలా కూడా ప్లాన్ చేస్తున్నారా??

Mahesh Babu : ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే మంచి హ్యాండ్సమ్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పాలి. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా అదే యంగ్ లుక్ లో హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు మహేష్. అయితే ఇలాంటి లుక్స్ ఉంచుకొని మహేష్ ఒక్క తెలుగు సినిమాకే పరిమితం అయ్యిపోవడం మూవీ లవర్స్ కి అంత నచ్చే అంశం కాదు. తన పాన్ ఇండియా ఎంట్రీ కోసం ఎప్పుడు నుంచో అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు దానిపైనే ఒక బిగ్ బజ్ వినిపిస్తోంది.

ప్రస్తుతం మహేష్ హీరోగా దర్శకుడు పరశురాం పెట్ల తీస్తున్న “సర్కారు వారి పాట” తోనే ఉండొచ్చని తెలుస్తుంది. అయితే స్పెషల్ గా హిందీలో రిలీజ్ కి ఎలాంటి మార్పులు చెయ్యలేదు కానీ ఒక ప్రయత్నంగా హిందీలో డబ్ చేసి కూడా సర్కారు వారి పాట ని రిలీజ్ చెయ్యాలని చిత్ర బృందం అనుకుంటున్నారట. ఎలాగో తర్వాత త్రివిక్రమ్ తో చేసే సినిమా ఆ తర్వాత రాజమౌళి తో సినిమాలు కూడా వేరే స్థాయిలో ఉండనున్నాయి. అందుకే ముందే హిందీ ప్రేక్షకులను మహేష్ పలకరించాలి అనుకుంటున్నారట. మరి దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది.