“మాచర్ల”కి షాక్ తప్పదా.. నితిన్ దర్శకుడిపై సంచలన ఆరోపణలు వైరల్.!

ఈ ఏడాది సగం పూర్తయ్యి రెండో సగం లోకి అడుగు పెట్టాక మన తెలుగు సినిమాలు పరిస్థితి ఎలా ఉందొ చూస్తున్నాం. దీనితో సరైన హిట్ కోసం చిత్ర నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ లిస్ట్ లోనే ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన చిత్రాలు ది వారియర్, థాంక్ యూ లు డిజప్పాయింట్ చేసి బాక్సాఫీస్ దగ్గర షాకింగ్ వసూళ్లు అందుకున్నాయి.

ఇక దీనితో అందరు నితిన్ నటించిన మాస్ చిత్రం “మాచర్ల నియోజకవర్గం” కోసం చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి అంతా బాగానే ఉంది కానీ తాజాగా ఈ సినిమా దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పెట్టిన ట్వీట్స్ అంటూ కొన్ని పోస్ట్ లు బయట పెట్టి ఈ సినిమాకి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాకిచ్చారు.

మరి ఆ దర్శకుని పేరు తోనే ఉన్న హ్యాండిల్ నుంచి పలు కుల దూషణలు ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి అభిమానిగా చెప్పుకున్నట్టుగా ఉన్నాయి. దీనితో ఇలాంటి దర్శకుని నుంచి వస్తున్న సినిమా అంటూ ఎవరూ చూడొద్దని షాకింగ్ ట్రెండ్ నడుస్తుంది.

దీనితో ఈ ఆరోపణలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా నితిన్ మాత్రం వీటిలో ఎలాంటి నిజం లేదని ఎవరు నమ్మవద్దని అది ఫేక్ అకౌంట్ అని తెలుపుతున్నాడు. అంతే కాకుండా దర్శకుడు కూడా తాను అలాంటి ట్వీట్స్ చెయ్యలేదని తాను అయితే వై ఎస్సార్ అభిమానినే కానీ అలాంటి దారుణ పోస్ట్ లు అయితే పెట్టలేదని తెలిపాడు. మొత్తానికి అయితే ఇదే కంటిన్యూ అయితే మాచర్ల సినిమాకి షాక్ తప్పేలా లేదనిపిస్తుంది.