Bellamkonda Suresh: బెల్లం ఫ్యామిలీ ఏ కథనీ వదిలేలాలేరుగా !

Bellamkonda Suresh buys Karnan rights for his son

Bellamkonda Suresh: బెల్లంకొండ శ్రీనివాస్.. హీరోగా ఎన్నో ప్రయత్నాలు చేసినా అడపదడపా హిట్లే తప్ప నిలబడిపోయేలా వరుస విజయాలు దొరకట్లేదు ఆయనకు. కొత్తది అనుకుని చేసిన ప్రతి ప్రయత్నమూ దెబ్బకొట్టేస్తోంది. కుమారుడి మీద కోట్లు కుమ్మరించిన సురేష్ కు సంతృప్తి అనేది దొరకలేదు. ఇప్పుడు రెండో కుమారుడు గణేష్ కూడ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Bellamkonda Suresh buys Karnan rights for his son
Bellamkonda Suresh buys Karnan rights for his son

అందుకే శ్రీనివాస్ ను ఇంకో నాలుగైదు మెట్లు ఎక్కించాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. చిన్న కొడుకు ఎంట్రీ ఇచ్చే టైంకి పెద్ద కొడుకు స్టార్ హీరోలా ఉండాలనేది అయన కోరిక. అందుకే కొత్త దారులు వెతుకుతున్నారు. హిట్ కథలను వల వేసి పట్టుకుంటున్నారు. ఇప్పటికే శ్రీనివాస్ ను బాలీవుడ్లోకి ప్రవేశపెట్టే పని స్టార్ట్ చేశారు. తెలుగులో ప్రభాస్ చేసిన ‘ఛత్రపతి’ కథను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అది హిట్టయితే ఉత్తరాదిలో పాతుకుపోవచ్చనేది అయన ఐడియా.

తాజాగా తమిళంలో ధనుష్ చేసిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులు కూడ కొనేశారట ఆయన. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఆ సినిమా శ్రీనివాస్ కెరీర్ ఎదుగుదలకు సహకరిస్తుందని భావిస్తున్నారట. మొత్తానికి బెల్లం ఫ్యామిలీ మంచిది అనదగిన ఏ కథనీ పక్కకు పోనియ్యట్లేదు.