యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సంగతి తెలిసిందే. హిందీలోకి మంచి యాక్షన్ కథతో దిగాలనుకుంటున్న బెల్లంకొండ అందుకు ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని చూజ్ చేసుకున్నారు. వివి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ఈ చిత్రంతో బాలీవుడ్లో పాగా వేయాలనేది బెల్లంకొండ టార్గెట్. యూట్యూబ్ ద్వారా విడుదలైన ఆయన ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ మంచి హిట్ అయింది. మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు. దీన్నే బేస్ చేసుకుని హీరోగా సెటిలవ్వాలని అనుకుంటున్నాడు.
అందుకే తనను అక్కడి వారు ఓన్ చేసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో భాగంగానే తన హిందీ డబ్బింగ్ తానే చెప్పుకోవాలని ఫిక్సయ్యాడు. డబ్బింగ్ చెప్పాలి అంటే హిందీ భాష మీద మంచి పట్టు ఉండాలి. ఆ పట్టు కోసమే హిందీ తరగతులకు వెళ్తున్నాడట బెల్లంకొండ. ఈ ప్రయత్నం ఒక రకంగా మంచిదే. ఏ భాషలో అయితే సినిమాలు చేస్తున్నారో ఆ భాష మీద పట్టు ఉండటం కెరీర్ కు కలిసి వచ్చే విషయం. ఒకవేళ ‘ఛత్రపతి’ రీమేక్ గనుక హిట్ అయితే అక్కడి నిర్మాతలు బెల్లంకొండతో సినిమాలు నిర్మించాలని అనుకోవచ్చు కూడ. అప్పుడు హిందీ లాంగ్వేజ్ తెలిసి ఉండటం బాగా ప్లస్ అవుతుంది. బెల్లంకొండ ప్రయత్నాలు చూస్తుంటే హిందీలో సెటైలవ్వాలని ఆయన గట్టిగానే డిసైడ్ అయినట్టు ఉన్నారు.