Krithi Shetty : మాస్ సంచలనం: కృతిశెట్టి ఓ మెట్టు పైకెక్కిందిగా.!

Krithi Shetty : తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరుగా చెలామణీ అవుతోంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. వరుస ప్రాజెక్టులతో బిజీగా వుంది. వరుస సినిమాలే కాదు, వరుస సక్సెస్‌లు కూడా అందుకుంటోంది బేబమ్మ.

ఈ లోపు కోలీవుడ్ నుంచి కూడా బేబమ్మకి పిలుపొచ్చింది. ది గ్రేట్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. సూర్య స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా ఇది. త్వరలోనే సెట్స్ మీదికెళ్లనున్నఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి ఎంపికయ్యిందట.

డైరెక్టర్ బాల అంటే అంత ఆషామాషీ కాదండోయ్. చాలా డెడికేటెడ్ డైరెక్టర్ ఆయన. నటన విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాడు.

అలాంటి డైరెక్టర్‌నే కృతిశెట్టి ఇంప్రెస్ చేసేసిందట. ‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో కృతిశెట్టి నటనకు ఇంప్రెస్ అయిన బాల తన సినిమాలో కృతిశెట్టినే హీరోయిన్ అని ఫిక్సయిపోయాడట. తమిళ్‌లో ఫస్ట్ సినిమాకే బాల వంటి దర్శకుడితో పని చేయడం నిజంగా బేబమ్మ అదృష్టమే అనాలేమో.

అంతేకాదు, నటిగా మరో మెట్టు ఎక్కడానికి కూడా ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది కృతిశెట్టికి. అలాగే, రెమ్యునరేషన్ విషయంలోనూ బేబమ్మ ప్రమోషన్ అందుకున్నట్లే అని టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక తెలుగులో కృతిశెట్టి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, రామ్‌తో ‘ది వారియర్’, సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది.