స్టార్ హీరోయిన్‌కీ ఆడిషన్స్ తప్పలేదంటే.!

కాస్త బొద్దుగా కనిపించే ముద్దుగుమ్మ రాశీఖన్నా ఈ మధ్య తెగ కష్టపడి స్లిమ్ అండ్ స్లీకీగా మారిపోయిన సంగతి తెలిసిందే. రాశీఖన్నా స్లిమ్ ఫోటో షూట్లు ఈ మధ్య నెట్టింట జోరుగా హల్‌చల్ చేశాయి కూడా. ఆమె జీరోసైజ్ అందాలకు నెటిజన్లు సైతం షాకయ్యారు.

ఇక రాశీఖన్నా ప్రస్తుతం ఏమంత బిజీగా లేదనే చెప్పాలి. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. అదే ‘థాంక్యూ’ సినిమా. నాగ చైతన్య ఈ సినిమాలో హీరో. దీంతో పాటు, హీందీలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో ఓ వెబ్ సిరీస్‌లోనూ రాశీఖన్నా నటిస్తోంది.

అసలు విషయమేంటంటే, ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు రాశీఖన్నా ఆడిషన్స్‌లో పాల్గొనాల్సి వచ్చిందట. ఆ విషయాన్నే తాజాగా చెబుతూ, స్టార్‌డమ్ గురించి ప్రస్థావించింది రాశీఖన్నా. రాశీఖన్నాలాంటి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్‌కే ఆడిషన్స్ నిర్వహించారంటే ఆ వెబ్ సిరీస్‌కి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవాలి. ‘రుద్ర’ అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.