Balayya : వైరల్ : బాలయ్య – గోపీచంద్ సినిమా నుంచి అదిరే డైలాగ్ లీక్..!

Balayya : టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అదిరే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నందమూరి వారి నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. మరి తన కెరీర్ లో మళ్ళీ భారీ హిట్ తో ట్రాక్ లో పడింది మాత్రం “అఖండ” సినిమాతో అని చెప్పాలి. దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీసిన ఈ హ్యాట్రిక్ సినిమా తన కెరీర్ లోనే ఒక భారీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

అయితే చిత్ర బృందం ఈ సినిమా విజయం పట్ల మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉండి ఆ అంచనాలను అనుకున్నట్టే రీచ్ అయ్యారు. ఇక ఈ సినిమా విజయం తర్వాత బాలయ్య తన కెరీర్ లో ఇంకో భారీ మాస్ సినిమాని లోడ్ చేశారు. అది కూడా “క్రాక్” లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓకే చేసి తన సినిమా లైనప్ ని మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచే ఓ ఆసక్తికర డైలాగ్ లీక్ అయ్యినట్టు తెలుస్తుంది. పైగా ఇది కానీ బాలయ్య చెప్తే వేరే స్థాయిలో ఉంటుంది అని బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచే ఎగ్జైట్ అవుతున్నారు. ఇంతకీ ఆ వైరల్ అవుతున్న డైలాగ్ ఏది అంటే..

‘రేయ్ రోడ్డు మీదకి జింక వచ్చిందనుకో ఎవడైనా హారన్ కొడతాడు అదే సింహం వచ్చిందంటే ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్గా కూర్చుంటాడు అక్కడ ఉన్నది సింహం రా రేయ్’ అట. వినడానికే అదిరే లెవెల్లో ఉంది కదా. ఇక దీనిని బాలయ్య చెబితే మరో స్థాయిలో ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ఈ డైలాగ్ వైరల్ అవుతుంది.