బాలయ్య కి భలే వెరైటీ ట్విస్ట్ ఇచ్చిన చంద్రబాబు లోకేశ్ !

తన తండ్రి స్థాపించిన పార్టీ అయినప్పటికీ టీడీపీలో ఎప్పుడు బాలకృష్ణ ఒక నేతగా, కార్యకర్తగా ఉన్నారే తప్పా ఎప్పుడు పెద్దగా టీడీపీలో కీలకంగా వ్యవహరించాలని ఎప్పుడు కోరుకోలేదు, ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. అయితే 2019 ఎన్నికల తరువాత మాత్రం పార్టీలో బాలకృష్ణకు ఉన్న ప్రధాన్యతలో చాలా మార్పు వచ్చింది. పార్టీ తీసుకుంటున్న ప్రతి కీలక నిర్ణయం వెనక బాలయ్య ఉంటున్నారు. ఆయనకు తెలియకుండా టీడీపీలో చిన్న కార్యకర్తను కూడా నియమించడం లేదు.

ఇదంతా లోకేష్ కోసమే

టీడీపీకి భవిష్యత్ నాయకుడు, టీడీపీని నడిపించేది చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ . ఈ నారా లోకేష్ ను రానున్న రోజుల్లో టీడీపీ నడిపించే నాయకుడిగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో జరిగే ప్రతి మార్పు లోకేష్ ను నాయకుడిగా నిలబెట్టడానికే జరుగుతున్నాయి.

lokesh
lokesh

అలాగే ఇప్పుడు బాలయ్యను కూడా లోకేష్ కు రాజకీయ సలహదారుడిగా ఉండమని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సమాచారం. రానున్న రోజుల్లో తాను ఎలాగైతే ఇప్పుడు లోకేష్ కు అండగా ఉన్నానో నువ్వు కూడా అలానే ఉండాలని బాలయ్యకు చంద్రబాబు చెప్పాడని, అందుకే ఇప్పుడు టీడీపీలో బాలయ్య ప్రాధాన్యత పెరిగిందని, కీలక నిర్ణయాలు బాలయ్య తీసుకుంటున్నారని సమాచారం.

బాలయ్య ఇంటికి క్యూ కడుతున్న నేతలు

రానున్న రోజుల్లో పార్టీలో కీలకంగా బాలయ్య ఉంటారని తెలుసుకున్న టీడీపీ నేతలు ఇప్పటి నుండే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొస్తాకు చెందిన చాలామంది నేతలు వచ్చే ఎన్నికల్లో తమకే సీట్ ఇవ్వాలని ఇప్పటి నుండే బాలయ్యకు వినతి పత్రాలు కూడా ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. లోకేష్ ను రాజకీయంగా నిలబెట్టడానికి తండ్రి చంద్రబాబు నాయుడుతో పాటు మామా బాలయ్య కూడా చాలా కష్టపడుతున్నారు. పతనావస్థకు చేరుకున్న టీడీపీని లోకేష్ ఎలా నడిపిస్తారో, ఎలా గెలిపిస్తారో వేచి చూడాలి.